![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ (krishna) అల్లుడు, మహేష్ బాబు(mahesh babu)బావ హోదాలో సినీ రంగ ప్రవేశం చేసిన నటుడు సుధీర్ బాబు(sudheer babu) వారసత్వాన్ని అలంకారంగా తీసుకోకండా సినిమా సినిమాకి కష్టపడుతు తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటు ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు హరోం హర (harom hara) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుధీర్ బాబు చెప్పిన కొన్ని విషయాలు టాక్ అఫ్ ది డే గా నిలిచాయి.
సుధీర్ బాబు కి ఇద్దరు కొడుకులు.పెద్ద కొడుకు పేరు చరిత్ మానస్(charith manas) స్టంట్స్ చెయ్యడంలో ఇండియా లోనే నెంబర్ వన్ గా ఉన్నాడు. కళ్ళు మోసి తెరిచేలోగా జెట్ స్పీడ్ తో చరిత్ చేసే స్టంట్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో చరిత్ కి చాలా మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాగే మహేష్ ఫ్యాన్స్ అయితే చరిత్ అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నాడని వాకింగ్ స్టైల్ కూడా అలాగే ఉందని అంటుంటారు. కానీ సుదీర్ బాబు మాట్లాడుతు ఎవరైనా మహేష్ లాగా ఉన్నావని అంటే చరిత్ కి కోపం వస్తుంది. స్టంట్స్ లో చాలా కష్టపడుతున్నాడు.తనకి సంబందించినవన్ని తనే షూట్ చేసుకొని సోషల్ మీడియాలో పెడతాడు. ఫ్యామిలీ పేరు పెట్టుకొని బతకడానికి అయితే రాలేదు. ఎన్నో కష్టమైన స్టంట్స్ ని కూడా చేస్తాడు. అవి ఎవరు చెయ్యలేరు.ఇండియా మొత్తంలో విజు జమైల్, టైగర్ ష్రఫ్ లు అలాంటివి చేస్తారు. అలాగే సినిమా ఫ్యామిలీ అయినంత మాత్రాన వెంటనే పేరు రావాలని కూడా లేదని చెప్పాడు.
.webp)
ఇక హరోం హర (harom hara) విషయానికి వస్తే 1990 వ ప్రాంతంలో జరిగే కథగా తెరకెక్కుతుంది. గన్స్ తయారీ నేపధ్యంలో ఉండబోతుంది..ట్రైలర్ బాగుండటంతో అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా ఛైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.మాళవిక శర్మ హీరోయిన్ కాగా సునీల్ రవి కాలే, కేశవ దీపక్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. జూన్ 14 న విడుదల కానుంది.
![]() |
![]() |