![]() |
![]() |

`అల వైకుంఠపురములో` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ పాన్ - ఇండియా మూవీని బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. `రంగస్థలం` వంటి బ్లాక్ బ్లస్టర్ తరువాత సుక్కు నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో.. `పుష్ప`పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. `పుష్ప` తొలి భాగం `పుష్ప - ద రైజ్`ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు కొన్నాళ్ళ క్రితం అధికారిక ప్రకటన చేసింది యూనిట్. అయితే, ఏ తేదిన సినిమా విడుదల కాబోతుందో అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. డిసెంబర్ 17ని `పుష్ప - ద రైజ్`కి రిలీజ్ డేట్ గా లాక్ చేశారట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.
కాగా, `పుష్ప`లో బన్నీకి జంటగా రష్మికా మందన్నా నటిస్తుండగా.. ప్రతినాయకుడిగా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ దర్శనమివ్వనున్నారు. సునీల్, అనసూయ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |