![]() |
![]() |

ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చెర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.
ఉత్తేజ్ సతీమణి పద్మావతి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్ ను పరామర్శించారు. పద్మావతి మరణవార్తను వినగానే చిరంజీవి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని.. ఉత్తేజ్ ను పరామర్శించారు. చిరంజీవిని చూడగానే ఉత్తేజ్ భోరున విలపించారు.

ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో ఆయన సతీమణి భాగస్వామి అయ్యేవారు. ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. ఆమె ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
![]() |
![]() |