![]() |
![]() |

టాలీవుడ్‌లో అఖిల్ అక్కినేని సరసన నటించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది కల్యాణి ప్రియదర్శన్. ఆమె ప్రముఖ మలయాళం డైరెక్టర్ ప్రియదర్శన్, నటి లిజి కుమార్తె. తెలుగులో 'హలో', 'చిత్రలహరి', 'రణరంగం' సినిమాలు చేశాక, శివ కార్తికేయన్ మూవీ 'హీరో' ద్వారా తమిళంలో, ఆ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో 'వరణే అవశ్యముండ్' మూవీతో మాతృభాష మలయాళంలో పరిచయమైంది కల్యాణి. త్వరలో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
దక్షిణాది సినిమాలతోనే కాకుండా పలు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ద్వారా ప్రియదర్శన్‌కు డైరెక్టర్‌గా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. విరాసత్, హేరాఫేరి, డోలీ సజా కే రఖ్‌నా, హంగామా, క్యోం కి, భాగమ్ భాగ్, చుప్ చుప్ కే, భూల్ భులయ్యా, ఆక్రోశ్, హంగామా 2 సినిమాలతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు ప్రియదర్శన్. అక్కడి పలువురు స్టార్స్‌తో, నిర్మాణ సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కావాలనుకుంటే కల్యాణిని ఆయన గ్రాండ్‌గా బాలీవుడ్‌లో లాంచ్ చేయవచ్చు.
కానీ, కల్యాణి తండ్రి సపోర్ట్ తీసుకోకుండా తనంతట తానుగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని భావించింది. త్వరలోనే ఆమె ఓ భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలో నటించబోతోంది. చెన్నైలో స్కూలు చదువు, సింగపూర్‌లో కాలేజీ చదువు పూర్తి చేసింది కల్యాణి. ఆ తర్వాత న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌లో డిగ్రీ పొంది, హిందీ ఫిల్మ్ 'క్రిష్ 3', తమిళ ఫిల్మ్ 'ఇరు ముగన్' సినిమాలకు అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత 'హలో' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
![]() |
![]() |