![]() |
![]() |

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం సాయి తేజ్ కాలర్ బోన్‌కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆయనకు నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయిందని డాక్టర్స్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో సాయి తేజ్ కు కాలర్ బోన్ విరిగింది. అపోలో ఆసుపత్రి డాక్టర్ ఆలోక్ రంజన్ బృందం సాయి తేజ్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత 24 గంటలకు పైగా ఆయనను పూర్తిగా తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్న వైద్యులు.. ఆదివారం ఆయనకు సర్జరీ నిర్వహించారు. దీనికి సంబంధించిన బులెటిన్ ను విడుదల చేసారు అపోలో వైద్యులు. సాయి తేజ్ కు నిర్వహించిన కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తైందని తెలిపారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు.
కాగా, సాయి తేజ్ త్వరగా కోలుకోవాలంటూ సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. పలువురు ఆసుపత్రికి వెళ్లి సాయి తేజ్ ని పరామర్సిస్తున్నారు.
![]() |
![]() |