![]() |
![]() |

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'తగ్గేదేలే' అంటూ నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న బన్నీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. దీంతో ఇటీవల బన్నీ ఎన్నో యాడ్స్ లో దర్శనమిస్తున్నాడు. అయితే కొన్ని యాడ్స్ ఆయనకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఓ యాడ్ కారణంగా తాజాగా బన్నీపై కేసు నమోదైంది.
గతంలో బన్నీ నటించిన ర్యాపిడో యాడ్ లో ఆర్టీసీ బస్సుల గురించి తక్కువ చేసి చూపించడంతో టీఎస్ఆర్టీసీ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యాడ్ ని మార్చేశారు. అలాగే బన్నీ నటించిన జొమాటో యాడ్ లో సౌత్ సినిమాలను కించపరిచారంటూ వివాదాస్పదమైంది. ఇక తాజాగా బన్నీ నటించిన మరో యాడ్ అయితే పోలీస్ కేసు వరకు వెళ్ళింది.
ఇటీవల బన్నీ శ్రీచైతన్య విద్యాసంస్థల యాడ్ లో నటించాడు. అయితే ఆ యాడ్ లో ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ శ్రీచైతన్యతో పాటు అల్లు అర్జున్ పై ఉపేందర్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. చూస్తుంటే బన్నీకి యాడ్స్ ఏ మాత్రం కలిసిరావడం లేదనిపిస్తోంది.
![]() |
![]() |