![]() |
![]() |

కొన్ని రోజులుగా ఆర్థిక పరమైన విభేదాలతో ఒకర్నొకరు దుమ్మెత్తిపోసుకుంటూ, సవాళ్లు విసురుకుంటూ, కేసులు పెట్టుకుంటూ వచ్చిన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ, ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కలిసిపోయారు. తమ మధ్య విభేదాలు సమసిపోయాయనీ, తిరిగి కలిసి పనిచేస్తామని చెప్పారు. నట్టి కుమార్ తన గురించి అన్నవి కానీ, తాను ఆయన గురించి అన్నవి కానీ ఇప్పుడు తూచ్ అయిపోయాయని ఆర్జీవీ అన్నారు. ఇద్దరూ కలిసి ఓ వీడియో మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. చివరలో ఇద్దరూ చేయి చేయీ కలిపారు.
ముందుగా ఆర్జీవీ మాట్లాడుతూ, మిస్ అండర్‌స్టాండింగ్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఇద్దరం కాఫీ తాగడానికి వచ్చాం. ఇది చాలామందికి హ్యాపీ అవ్వచ్చు, కొంతమందికా కాకపోవచ్చు. నేను ఆయన (నట్టి కుమార్) గురించి అన్నది కానీ, ఆయన నా గురించి అన్నవి కానీ ఇప్పుడు తూచ్ అయిపోయాయి. ఫ్యూచర్‌లో కూడా కలిసి పనిచేస్తాం. ఆయన చెప్పినంత నేను గుడ్ కాదు, నేను చెప్పినంత ఆయన బ్యాడ్ కాదు. మెయిన్ పాయింట్.. మళ్లీ మేం కలిశాం. నేను కరుణ, క్రాంతి మీద పోలీస్ కేసు పెట్టింది, కేవలం అగ్రిమెంట్‌లో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మాకున్న విభేదాలు వల్ల, డైరెక్టర్స్‌గా దానికి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్లిద్దరి పేర్లు నేను పెట్టాను కానీ.. వ్యక్తిగతంగా వాళ్లపై నాకు ద్వేషం కానీ, గొడవ కానీ లేదు. ఎప్పుడు కలిసినా వాళ్లు నాతో చాలా బాగుంటారు, నేనూ బాగుంటాను. అని చెప్పారు.
ఆ తర్వాత నట్టి కుమార్ మాట్లాడుతూ, వర్మగారూ, నేను మంచి ఫ్రెండ్స్‌మి. కొంతమంది మధ్యవర్తులు పెట్టిన చిచ్చుల వల్ల మేం ఒకరికొకరం దూరమయ్యాం. మళ్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా వర్క్ చేసుకుంటాం. మా మధ్య గొడవలు ముగిసిపోయాయి. మేం పెట్టిన కేసులు కానీ, వాళ్లు పెట్టిన కేసులు కానీ ఉపసంహరించుకున్నాం. పరస్పర అవగాహనతో కలిసి పనిచేసుకుంటాం. నేను ఆరోజు చెప్పినట్లు మనీ డిస్‌ప్యూట్ తప్ప, ఫ్యామిలీ పరంగా మా ఇద్దరికీ మధ్య డిస్‌ప్యూట్ లేదు. మధ్యవర్తులకు మేం కలిసిపోయామని బాధ ఉండొచ్చు. వాళ్లెవరనేది త్వరలోనే ఇద్దరం కలిసి బయటపెడతాం. అన్నారు.
నిజానికి ఆ ఇద్దరూ కలవడానికి కొద్ది సేపటి ముందు, నట్టి కుమార్ పిల్లలు కరుణ, క్రాంతిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీ పెట్టిన ఫోర్జరీ కేసులో వారిని అరెస్ట్ చేయరాదనీ, కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చనీ తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ విషయాన్ని కుమార్ తన పీఆర్ ద్వారా మీడియాకు ఓ ప్రెస్‌నోట్ ద్వారా తెలియజేశారు. అంతలోనే తామిద్దరూ కలిసిపోయినట్లు వారు ప్రకటించడం గమనార్హం.
![]() |
![]() |