![]() |
![]() |

`ముకుంద`(2014)తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే, `మెగా కాంపౌండ్ హీరో`అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చినా, వైవిధ్యభరితమైన కథాంశాలతో తొలి అడుగులు వేసినా.. మొదటి నాలుగు సినిమాలతో మాత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాడు వరుణ్. ఈ నేపథ్యంలో.. ఐదో చిత్రంగా వచ్చిన `ఫిదా` (2017)తో ఏకంగా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు. ఆపై `తొలిప్రేమ`(2018)తోనూ విజయాన్ని అందుకుని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వార్తల్లో నిలిచాడు.
అయితే, హ్యాట్రిక్ గా నిలుస్తుందనుకున్న `అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్`(2018) అనూహ్యంగా పరాజయం పాలైంది. దీంతో నిరాశపడ్డ వరుణ్ కి.. `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` (2019) రూపంలో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కడం అతనిలో నూతనోత్తేజాన్ని నింపినట్లయ్యింది. ఈ క్రమంలో.. ఈ దీపావళికి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న `గని`తో పలకరించబోతున్నాడు వరుణ్. ఇందులో బాక్సర్ గా ఎంటర్టైన్ చేయనున్నాడీ యంగ్ హీరో. మరి.. `అంతరిక్షం`తో హ్యాట్రిక్ మిస్ అయిన వరుణ్.. `గని`తో అయినా ఆ ముచ్చట తీర్చుకుంటాడేమో చూడాలి.
కాగా, కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న `గని`లో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |