![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో సింహభాగం మ్యూజికల్ గా మెప్పించినవే. ఎస్.ఎ. రాజ్ కుమార్, దేవా, విద్యాసాగర్, ఎ.ఆర్. రెహమాన్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్ వంటి కొంతమందిని మినహాయిస్తే.. కోటి, రమణ గోగుల, మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్, అనూప్ రూబెన్స్ ఇలా తనకు కనెక్ట్ అయిన అందరితోనూ రెండు, అంతకుమించి సినిమాలు చేశారు పవన్. ప్రస్తుతం తమన్ విషయంలోనూ అదే శైలిని కొనసాగిస్తున్నారు. `వకీల్ సాబ్` కోసం ఫస్ట్ టైమ్ తమన్ కి ఛాన్సిచ్చిన పవన్.. ఆ వెంటనే `భీమ్లా నాయక్` కోసం సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అలా పవన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి స్వరాలు అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు తమన్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తమన్ కంటే ముందు మరో ఇద్దరు స్వరకర్తలు పవన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి పని చేశారు. ఆ సంగీత దర్శకులే.. కోటి, రమణ గోగుల. పవన్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి`కి బాణీలు అందించిన కోటి.. ఆపై రెండో సినిమా `గోకులంలో సీత` కోసం వెంటనే రెండోసారి ట్యూన్స్ అందించారు. ఇక `తమ్ముడు` కోసం ఫస్ట్ టైమ్ పవన్ కాంబోలో పనిచేసిన రమణ గోగుల.. ఆపై వెనువెంటనే `బద్రి`కి స్వరాలు సమకూర్చారు. మొత్తమ్మీద.. కోటి, రమణ గోగుల తరువాత పవన్ కాంబోలో వెంట వెంటనే ఫస్ట్, సెకండ్ కాంబో మూవీస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.
![]() |
![]() |