![]() |
![]() |

హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. త్వరలో బిడ్డకి జన్మనివ్వబోతున్న ఆమె అమ్మగా మారే క్షణం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. తాజాగా ఆమె సీమంతం వేడుక జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

'లక్ష్మి కళ్యాణం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన కాజల్ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చందమామగా స్థానం సంపాదించుకుంది. 2020 అక్టోబర్ లో బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న కాజల్ ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో తాను గర్భం దాల్చినట్లు ప్రకటించిన కాజల్ సినిమాల నుంచి విరామం తీసుకుంది. కాజల్ బేబీ బంప్ ఫొటోలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె సీమంతం ఫోటోలు వైరల్ గా మారాయి.

సినిమాల విషయానికొస్తే దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ నటించిన 'హే సినామిక' మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవికి జోడీగా ఆమె నటించిన 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29 న విడుదల కానుంది.
![]() |
![]() |