![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ,హరీష్ శంకర్ ల కాంబినేషన్ కి ఉన్న పవర్ ఎలాంటిందో అందరికి తెలిసిందే. అసలు హరీష్ దర్శకుడుగా చేసిన రెండు సినిమాల్లోను రవితేజ నే హీరోయిన్. ఈ ఇద్దరికీ కాంబోలో మొదట వచ్చిన షాక్ పరాజయం చెందినప్పటికీ సెకండ్ సినిమా మిరపకాయ మాత్రం సూపర్ డూపర్ హిట్ సాధించి ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ ని కూడా క్రియేట్ చేసింది. మళ్ళీ ఈ ఇద్దరు ఒక సరికొత్త ట్రెండ్ ని సృష్టించడానికి రెడీ అయ్యారు.
రవితేజ హరీష్ కాంబినేషన్ లో ఒక కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా కూడా ప్రకటించారు. ఈ మూవీకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 28 నుండి హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. రవితేజ బిగ్ బి అమితా బచ్చన్ కి పెద్ద ఫ్యాన్ కావటంతో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ టైటిల్ తో సినిమా రావటం పట్ల రవితేజ అభిమానుల అందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాణం అవుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ కధానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంచించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |