![]() |
![]() |
రణబీర్ కపూర్, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హింసాత్మక, శృంగార సన్నివేశాలతో సినిమాలో బీభత్సం సృష్టించి.. కలెక్షన్ల పరంగా కూడా అదే దూకుడుని ప్రదర్శించిన ‘యానిమల్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.800 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని, ఎడల్ట్ కంటెంట్ అధికంగా ఉందని, వయొలెన్స్ ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. కొంతమంది సినీ ప్రముఖులు బహిరంగంగానే సినిమాని విమర్శించారు. ఎవరెన్ని రకాలుగా విమర్శించినా కలెక్షన్స్ మాత్రం స్టడీగానే వెళ్లాయి.
‘యానిమల్’ చిత్రం బంగ్లాదేశ్‌లో కాస్త ఆలస్యంగా విడుదలైంది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైతే.. బంగ్లాదేశ్‌లో మాత్రం డిసెంబర్ 7న రిలీజ్ అయింది. 3 గంటల 23 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి బంగ్లాదేశ్‌లో చుక్కెదురైంది. అక్కడి సెన్సార్ బోర్డ్ సినిమాలో ఉన్న హింసాత్మక సన్నివేశాల పట్ల, శృతి మించిన శృంగార సన్నివేశాల పట్ల అసహనం వ్యక్తం చేసింది. 27 నిమిషాల అడల్ట్ కంటెంట్ మరియు హింసాత్మక సన్నివేశాలను తొలగించాలని చిత్ర యూనిట్‌కి సూచించింది. 2 గంటల 56 నిమిషాల నిడివితో బంగ్లాదేశ్‌లో రిలీజ్ అయింది ‘యానిమల్’. అడల్ట్ కంటెంట్‌ని తొలగించడం పట్ల అక్కడి ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై బాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలు కూడా రావడం విశేషం.
![]() |
![]() |