![]() |
![]() |
ప్రమోషన్స్ ఉధృతంగా చేయకపోయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌వైపు కన్నెత్తి చూడకపోయినా ‘సలార్’ అనుకున్నది సాధించింది. భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను గడగడలాడిరచింది. శుక్రవారం మొదలైన కలెక్షన్ల వేట నాలుగు రోజులపాటు యదేచ్ఛగా కొనసాగింది. నాలుగు రోజుల్లో దాదాపు 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. మూడు రోజుల్లో 402 కోట్ల రూపాయలు రాబట్టిందని అధికారికంగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగో రోజు మరో రూ.100 కోట్లు ఉండొచ్చని అంచనా. సోమవారం వరకు లెక్కలు బాగానే ఉన్నాయి. ఇక అసలు కథ మంగళవారం నుంచి మొదలవుతుంది. ఎందుకంటే క్రిస్మస్ సెలవులు పూర్తయ్యాయి. ‘సలార్’ స్టామినా ఏమిటో మంగళవారం నుంచి చూపించాల్సి ఉంటుంది.
తెలంగాణలో మొదటివారం భారీగా టికెట్స్ రేట్లను పెంచారు. అది రెండో వారానికి సాధారణ స్థితికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే జనవరి 1 వరకు అమలులో ఉంటుంది. సినిమాకి బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మొదటి నాలుగు రోజులు టిక్కెట్స్ రేట్ల ప్రభావం కనిపించలేదు. రెండో వారం టిక్కెట్ల రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఇకపై లెక్కల్లో తేడాలు కనిపిస్తాయి. హాలీడేస్ అయిపోయిన తర్వాత ఏ సినిమాకైనా కలెక్షన్లు డ్రాప్ అవుతాయి. అది మరీ తిరుగులేని బ్లాక్‌బస్టర్ అయితే తప్ప అదే కలెక్షన్లు కొనసాగవు. ‘సలార్’ రూ.800 కోట్ల లక్ష్యంతో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో వచ్చినంత యునానిమస్ టాక్ తమిళ్, హిందీ, మలయాళంలలో రాలేదు. ఈ విషయంలో మేకర్స్ కొంత అసంతృప్తిగానే ఉన్నారు. అలాగే ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్ల ‘డంకీ’ డామినేషన్ కనిపించింది. ‘సలార్’ కలెక్షన్లు శనివారం వరకు స్టడీగా ఉంటే మరో వీకెండ్‌లోకి వెళ్లిపోతుంది. అది దానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక శుక్రవారం రిలీజ్ అయ్యే ‘డెవిల్’ వంటి సినిమాల వల్ల ‘సలార్’కి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సంక్రాంతి వరకు ఇదే దూకుడు కొనసాగిస్తే.. అప్పటికి రిలీజ్ అయ్యే సినిమాల ప్రభావం ఎలాగూ ‘సలార్’పై ఉంటుంది. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత ప్రభాస్‌కి సాలిడ్‌గా సూపర్‌హిట్ దక్కిందనే చెప్పాలి. దీని ప్రభావం భవిష్యత్తులో అతను చేసే సినిమాలపై ఎలా ఉంటుందో చూడాలి.
![]() |
![]() |