![]() |
![]() |

మూడున్నర దశాబ్దాలకి పై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలో ఒకరిగా చెలామణి అవుతు వస్తున్న హీరో వెంకటేష్..ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి విక్టరీ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన మాస్,క్లాస్ అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లోను తన సత్తా చాటాడు. సినిమా ఫంక్షన్స్ లో తప్ప బయట పెద్దగా కనపడని వెంకీ రేపు అందరికి ఒక ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఈ వార్త వెంకీ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.
విక్టరీ వెంకటేష్ నుంచి ఇప్పటి వరకు 74 సినిమాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు 75 వ సినిమాగా సైంధవ్ అనే సినిమా రాబోతుంది. దీంతో వెంకటేష్ 75 సినిమాలని పూర్తి చేసిన సందర్భంగా 27 వ తేదీన అంటే రేపు చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరగనున్నాయి. చిరంజీవి ,బాలకృష్ణ .నాగార్జునలు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొని వెంకటేష్ కి తమ అభినందనలని తెలియచేయనున్నారు. దీంతో వెంకటేష్ అభిమానుల్లో పండుగ వాతావరణం వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న ఫిలిం నగర్ జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 5 గం. ల నుండి గ్రాండ్ గా జరగనున్న ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథ మహారధులతో పాటు వెంకటేష్ తో సినిమాలు నిర్మించిన నిర్మాతలు దర్శకులు కూడా పాల్గొంటున్నారు.
వెంకటేష్ తన 75 వ చిత్రంగా సైంధవ్ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీని చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో జనవరి 13న విడుదల కాబోతున్న ఈ మూవీలో శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా చేస్తుండగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
![]() |
![]() |