![]() |
![]() |
.webp)
ప్రతీ ఏడాది థియేటర్లలో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం ఓటిటీలో విడుదలవుతాయి. ఓటిటీలో విడుదలయ్యే వాటిల్లో కొన్ని చిన్నసినిమాలు, మరికొన్ని పెద్ద సినిమాలు.. ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లు. వీటిల్లో ఈ సంవత్సరం ప్రేక్షకులకి వినోదాన్ని అందించినవేంటో? అత్యధిక వీక్షాకదరణ పొందినవేంటో ఒకసారి చూసేద్దాం...
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, గంగవ్వ, వేణు టిల్లు తదితరులు నటించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైంది. ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన ఒక వెబ్ సిరీస్. హీరో వేణు తొట్టెంపూడి నటించిన తొలి వెబ్ సిరీస్ 'అతిథి'. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైంది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ సిరీస్. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలలో మనిషి ఎలా పతనమవుతున్నాడనేది చూపిస్తూ ఇందులో దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న థీమ్ తో సస్పెన్స్ తో పాటు థ్రిల్ ని పంచారు మేకర్స్. స్కామ్ 2003 .. ది తెల్గీ స్టోరీ గా సోనిలివ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. 2003 లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ఆధ్యాంతం ఆసక్తిని కలిగించింది. అయలీ వెబ్ సిరీస్.. ఊరికట్టుబాట్లు దాటుకొని ఒక అమ్మాయి ఎలా చదువుకుంది. వారి పేరెంట్స్ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో తెలియజేస్తూ తీసిన ఈ సిరీస్ జీ-5 లో విడుదలైంది. అభి, నక్షత్ర, అనుమోల్, మదన్, సింగంపులి తదితరులు నటించిన ఈ సిరీస్ కి ముత్తు కుమార్ దర్శకత్వం వహించాడు. 1984 లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనని కళ్ళకి కట్టినట్టు చూపించిన సిరీస్ 'ది రైల్వేమెన్' . మధవన్, కెకె మీనన్, దివ్యేందు శర్మ, మందిరా బేడీ తదితరులు నటించిన ఈ సిరీస్ కి శివ్ రావైల్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ ని తెచ్చుకొని, విమర్శలు ఎదుర్కొన్న సిరీస్ 'రానా నాయుడు'. ఇది నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. జైలు నుంచి వచ్చిన తండ్రి (వెంకటేశ్) వల్ల రానా నాయుడు(రానా) ఎదుర్కొన్న సమస్యలేంటి? వారిమధ్య ఉన్న గొడవేంటనేది ఈ సీరీస్ లో కీలకం. సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ కలిసి దర్శకత్వం వహించారు. వెంకటేశ్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ 'రానా నాయుడు' కావడం విశేషం.
బాలివుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించిన తొలి వెబ్ సిరీస్ 'ఫర్జీ'. రాజ్ - డికే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా ఇతర పాత్రలలో నటించారు. తాత మొదలెట్టిన ఓ పేపర్ కంపెనీ మూతబడుతుంది. దానిని తిరిగి ప్రారంభించడానికి ఓ యువకుడు ఏం చేశాడో చూపిస్తూ తీసిన ఈ సిరీస్ ప్రతీ మధ్యతరగతి వాడికి కనెక్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో బాగా హిట్ టాక్ తెచ్చుకున్న సిరీస్ 'దూత'. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ 'దూత' లో నాగచైతన్య ప్రధాన పాత్ర పోషించాడు. పార్వతీ తిరువోతు, భవానీ శంకర్ ఇతర పాత్రలలో నటించిన ఈ సిరీస్.. హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ గా నిలిచింది. వరుసగా జరుగుతున్న జర్నలిస్టు హత్యలకి కారణం వెతికే పనిలో ఇన్వెస్టిగేషన్ సాగుతుంటుంది. ప్రముఖ జర్నలిస్టు సాగర్ వర్మ అవధూరిని కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వెంటాడం, అతని లైఫ్ లో జరుగబోయేది ముందే రావడం ఇదంత ఒక మిస్టరీ థ్రిల్లర్ గా ప్రేక్షకులకి ఫుల్ ఇంటెన్స్ డ్రామాని ఇచ్చిందనే చెప్పాలి. తమిళ హీరో ఆర్యన్ నటించిన తొలి వెబ్ సిరీస్ 'ది విలేజ్'. సైంటిఫిక్ రీసెర్చ్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సిరీస్. ఒక గ్రామంలో జరిగిన సైంటిఫిక్ రీసెర్చ్ కి బలైన గ్రామస్థులు ఎదుర్కొన్న సమస్య వల్ల వారు సామాన్యులని వెంటాడే సీక్వెన్స్ దానిని హీరో ఆర్యన్ ఎదుర్కొన్న తీరు ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. త్రిష నటించిన మూవీ 'ది రోడ్'. చెన్నై నుండి మధురైకి వెళ్ళే జాతీయ రహదారిలో జరుగుతున్న కొన్ని ప్రమాదాలని సాధారణంగా చూసే జనాలకి.. అవన్నీ ప్రీ ప్లాన్ డ్ యాక్సిడెంట్స్ అని త్రిష కనిపెట్టే సీక్వెన్స్ అన్నీ కూడా ప్రేక్షకుడికి ఒక ఇంటెన్స్ డ్రామాని కలుగుజేస్తుంది. అవికాగోర్ ప్రధాన పాత్రలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన సిరీస్ 'వధువు'. అవికాగోర్ పెళ్ళికూతురుగా కన్పించిన ఈ సిరీస్ లో తన పెళ్ళి జరుగకూడదని ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాంటి క్రమంలో తనకి పెళ్ళి జరుగుతుంది. అయితే ఆ వధువుకి అత్తింట్లోని వాళ్ళంతా మిస్టరీగా కన్పిస్తుంటారు. మరి ఆ వధువు అత్తింట్లో ఎలా ఉందనేది ఈ సిరీస్ లో కొత్తగా ప్రెజెంట్ చేశారు మేకర్స్. బసిల్ జోసెఫ్, జగదీష్, మంజు పిల్లై ప్రధాన పాత్రల్లో, నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన మూవీ ' ఫాలిమీ'.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఒక ముసలాయన కాశీకి వెళ్ళాలనుకుంటాడు. అయితే తను వెళ్ళాలనుకున్న ప్రతీసారీ ఇంట్లో వాళ్ళు అడ్డుపడుతుంటారు. మరి అతను కాశీకి వెళ్ళాడా? కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎలా ఉన్నాయనేది చూపిస్తూ ప్రతీ ప్రేక్షకుడికి కామెడీని పంచాయి. ఈ సంవత్సరం ఓటిటీలో విడుదలైన వాటిల్లో ఇవి ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. మరి ఇందులో మీ ఫెవరెటో ఎంటో కామెంట్ చేయండి.
![]() |
![]() |