![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో ఇష్టపడి, మరెంతో కష్టపడి చేసిన సినిమా `గని`. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. గత శుక్రవారం (ఏప్రిల్ 8) జనం ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన `గని`.. రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కి అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ ముంగిట ఘోర పరాజయం తప్పలేదు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు వరుణ్ తేజ్ నుంచి రెండు చిత్రాలు రిలీజ్ కాగా.. రెండు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ వివరాల్లోకి వెళితే.. 2017 ఏప్రిల్ 14న విడుదలైన `మిస్టర్` అప్పట్లో వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు అదే ఏప్రిల్ లో జనం ముందు నిలిచిన `గని` కూడా అదే బాట పట్టింది. `మిస్టర్` రిలీజ్ సమయానికి వరుణ్ ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. అయితే, `గని`కి ముందు `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నా డిజాస్టర్ తప్పలేదు. ఏదేమైనా.. వరుణ్ తేజ్ కి ఏప్రిల్ నెల అంతగా కలిసిరాలేదనే చెప్పాలి.
![]() |
![]() |