![]() |
![]() |

హిలేరియస్ ఎంటర్టైనర్ లకి పెట్టింది పేరు దర్శకుడు శ్రీను వైట్ల. యాక్షన్, కామెడీల మేళవింపుగా శ్రీను వైట్ల తెరకెక్కించిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో `ఢీ` ఒకటి. కథానాయకుడు మంచు విష్ణు కెరీర్ లో తొలి హిట్ గా నిలిచిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించింది. శ్రీహరి, ప్రేమ, బ్రహ్మానందం, చంద్రమోహన్, ఆకాశ్, సునీల్, సుప్రీత్, అజయ్, సంతోషి, సుమ కనకాల, ఢిల్లీ రాజేశ్వరి, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, షఫి, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, ఛత్రపతి శేఖర్, మాస్టర్ భరత్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
చక్రి సంగీతమందించిన ఈ చిత్రంలో.. ``కనుపాపకు ఇది తెలుసా``, ``కొంచెం కొంచెం``, ``తోడాసా``, ``కిక్కు లేదురా``, ``ఏం మాయో మాయో``, ``మిర్చి మిర్చి``, ``జాతర`` అంటూ సాగే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. `బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్` (శ్రీను వైట్ల), `బెస్ట్ ఫైట్ మాస్టర్` (రామ్ - లక్ష్మణ్) విభాగాల్లో `నంది` పురస్కారాలు అందుకున్న `ఢీ`.. తమిళంలో `మిరట్టల్`, బెంగాలీలో `ఖోకాబాబు`` టైటిల్స్ తో తెరకెక్కింది. సిరి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించిన `ఢీ`.. 2007 ఏప్రిల్ 13న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 15 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |