![]() |
![]() |

జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మేజర్' మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని సంచలనం సృష్టించింది. వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. మూడు రోజుల్లో రూ.19 కోట్లకు పైగా షేర్ రాబట్టి హిట్ సినిమాల లిస్ట్ లో చేరిపోయింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 7.12 కోట్లు, రెండో రోజు 6.36 కోట్లు, మూడో రోజు 5.87 కోట్ల షేర్ రాబట్టిన మేజర్.. మూడు రోజుల్లో 19.35 కోట్ల షేర్(35.80 గ్రాస్)తో సత్తా చాటింది. పోటీగా సౌత్ స్టార్స్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య కలిసి నటించిన 'విక్రమ్' సినిమా ఉన్నప్పటికీ.. మంచి కలెక్షన్స్ రాబడుతూ 'మేజర్' మూవీ మూడో రోజే ప్రాఫిట్స్ లోకి ఎంటరవ్వడం విశేషం. ఫుల్ రన్ లో ఈ సినిమా బయ్యర్లకు భారీ లాభాలు మిగిల్చే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బిజినెస్ చేసిన మేజర్.. మొదటి రోజు 4.07 కోట్లు, రెండో రోజు 3.61 కోట్లు, మూడో రోజు 3.57 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో 11.25 కోట్ల షేర్ కలెక్ట్ చేసి లాభాల బాట పట్టింది. మూడు రోజుల్లో నైజాంలో 5.01 కోట్లు(3.50 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 1.28 కోట్లు(2 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 4.96 కోట్లు(4.50 కోట్ల బిజినెస్) రాబట్టింది. సీడెడ్ లో ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోవాల్సి ఉంది.
వరల్డ్ వైడ్ గా తెలుగు వెర్షన్ 13 కోట్ల బిజినెస్ చేయగా.. మూడు రోజుల్లోనే 17.20 కోట్ల షేర్ వచ్చింది. ఇతర భాషల్లో 2.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
![]() |
![]() |