![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన అనిల్.. అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు.
ఇటీవల 'ఎఫ్-3' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అనిల్ తాజాగా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాల గురించి చెప్పాడు. నెక్స్ట్ బాలకృష్ణతో విభిన్న తరహా యాక్షన్ ఫిల్మ్ చేయనున్న తాను.. ఆ తర్వాత తనకు హోమ్ బ్యానర్ లాంటి దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా ఉంటుందని తెలిపాడు. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై స్పందించిన అనిల్.. అవకాశమొస్తే ఖచ్చితంగా చేస్తానని అన్నాడు. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి తానే డైరెక్టర్ అని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని, ఇంతవరకు ఈ విషయంపై బాలకృష్ణ గారికి, తనకి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టంతా బాలకృష్ణ గారి మూవీ పైనే ఉందని, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని అనిల్ తెలిపాడు.
అనిల్ మాటలను బట్టి చూస్తే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతను బాలయ్య అనిల్ కి అప్పగించాడని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
![]() |
![]() |