![]() |
![]() |

2019 సంక్రాంతికి విడుదలైన 'F2' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సక్సెస్ జోష్ తో రీసెంట్ గా 'F3' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా 'F2' రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం సంగతి అటుంచితే.. ఇప్పుడసలు బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరల్డ్ వైడ్ గా రూ.63.60 కోట్ల బిజినెస్ చేసిన ఎఫ్-3 ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటిదాకా(9 రోజుల్లో) 50.03 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా ఇంకా 14 కోట్ల దూరంలో ఉంది. మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబడుతున్నా.. తాజాగా విడుదలైన 'మేజర్', 'విక్రమ్' సినిమాల దెబ్బకి బయ్యర్లకు నష్టాలు మిగిల్చే అవకాశముంది అంటున్నారు.
శుక్రవారం(జూన్ 3న) మేజర్, విక్రమ్ సినిమాలు విడుదలయ్యాయి. మేజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగా, విక్రమ్ యాక్షన్ ప్రియులను మెప్పిస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి ఈ రెండు సినిమాలపై పడటంతో ఎఫ్-3 కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఫుల్ రన్ లో ఈ సినిమా బయ్యర్లకు 10 కోట్ల దాకా నష్టాలు మిగిల్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఎఫ్-3 ఆ అంచనాలు తలకిందులు చేస్తుందో లేక నిజంగానే నష్టాలను మిగుల్చుతుందో చూడాలి.
![]() |
![]() |