![]() |
![]() |

'స్వామిరారా', 'కార్తికేయ' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ 'స్పై' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'గూఢచారి', 'ఎవరు', 'హిట్' లాంటి సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ బీహెచ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైంది.
హీరో పాత్రను పరిచయం చేస్తూ తాజాగా విడుదల చేసిన 'స్పై' గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మంచు కొండల్లో దాచి ఉన్న ఆయుధాలను వెతుక్కుంటూ వెళ్లిన నిఖిల్ అవి కనిపెట్టి.. గన్ పట్టుకొని వార్ కి రెడీ అన్నట్లుగా గ్లింప్స్ కట్ చేశారు. జూలియన్ ఎస్ట్రాడ సినిమాటోగ్రఫి, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. శ్రీచరణ్ కూడా గతంలో 'గూఢచారి', 'ఎవరు' వంటి సినిమాలకు పని చేయడమే కాకుండా.. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మేజర్'కి మ్యూజిక్ అందించాడు. గ్యారీ బీహెచ్, శ్రీచరణ్ వంటి టాలెంటెడ్ పీపుల్ వర్క్ చేస్తున్న 'స్పై' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ఆ లిస్టులో స్పై కూడా చేరుతుందేమో చూద్దాం.
కాగా నిఖిల్ నటించిన మరో రెండు సినిమాలు 'కార్తికేయ-2', '18 పేజెస్' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కావడం విశేషం.
![]() |
![]() |