![]() |
![]() |

`జానీ` (2003), `శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్` (2004) వంటి చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన వైష్ణవ్ తేజ్.. `ఉప్పెన`తో కథానాయకుడి అవతారమెత్తిన సంగతి తెలిసింది. గత శుక్రవారం విడుదలైన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెలుగునాట డెబ్యూ హీరోల సినిమాల్లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా.. `ఉప్పెన` నిలిచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉంటే.. `ఉప్పెన` తరువాత క్రిష్ డైరెక్టోరియల్ `కొండ పొలం`తో పలకరించబోతున్నాడు వైష్ణవ్. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ నవలాధారిత చిత్రం.. త్వరలోనే రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమా విడుదలయ్యేలోపే మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని వైష్ణవ్ దక్కించుకున్నాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్.. వైష్ణవ్ తో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని తీసేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. కింగ్ నాగార్జున నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడని వినికిడి. త్వరలోనే వైష్ణవ్, అన్నపూర్ణ స్టూడియోస్ కాంబో మూవీపై క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |