![]() |
![]() |
.jpg)
రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మంగళవారం ఆరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను మెడికల్ టెస్టుల కోసం ముంబైలోని సాయన్‌లో గల లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పటల్‌కి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా ఫలితం నెగెటివ్ అని వచ్చింది. రొటీన్ మెడికల్ చెకప్స్ కోసం తీసుకువెళ్లారు. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కువ ఉన్నారు కనుక ఆమెకు కొవిడ్–19 టెస్ట్ కూడా చేశారు. నెగెటివ్ రిజల్ట్ రావడంతో ఇప్పుడామెను నార్కోటిక్స్ లాకప్‌లో ఉంచవచ్చని సమాచారం.
రిచా చక్రవర్తి మీద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ చట్టంలోని 8 (సి), 20 (బి), 27 (ఎ), 28, 29 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారట. మంగళవారం సాయంత్రం ఏడున్నరకు ఆమెను డిజిటల్ కాన్ఫరెన్స్ ద్వారా జడ్జ్ ముందు ప్రవేశపెట్టారని సమాచారం. రియా చక్రవర్తి అరెస్ట్‌ను నార్కోటిక్స్ బ్యూరో ధృవీకరించింది. అరెస్ట్ చేయడానికి సరిపడా వివరాలను ఆమె విచారణలో వెల్లడించినట్టు డిప్యూటీ డీజీ ముత్త అశోక్ జైన్ వెల్లడించినట్టు ఏఎన్‌ఐ సంస్థ పేర్కొంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
![]() |
![]() |