![]() |
![]() |

తమిళ హీరో కార్తీ(Karthi)కి తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీ నటించిన సినిమాలు మంచి వసూళ్లను రాబడుతుంటాయి. అలాంటిది కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కాకుండా, నేరుగా ఓటీటీలోకి వస్తోంది.
కార్తీ, కృతి శెట్టి జంటగా నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'వా వాతియార్' (Vaa Vaathiyaar). స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ.. జనవరి 14న తమిళ్ లో విడుదలైంది. తెలుగులో 'అన్నగారు వస్తారు' (Annagaru Vostaru) పేరుతో విడుదల చేయాలనుకున్నారు కానీ, అది జరగలేదు. ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

తమిళనాట 'వా వాతియార్' నెగెటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. అందుకే రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అంటే తెలుగులో థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాలి.
Also Read: విజయ్ 'రణబాలి' మూవీ.. ఆ నవలకు కాపీనా..?
![]() |
![]() |