![]() |
![]() |

-హైకోర్టు ఏం చెప్తుంది
-అసలు అకిరా నందన్ హై కోర్టు కి ఎందుకు వెళ్ళాడు!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
పవర్ స్టార్' పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)నట వారసుడు 'అకిరా నందన్'(Akira Nandan)సినీ రంగ ప్రవేశం చెయ్యాలనేది అభిమానుల ఆశ. వాళ్ళ ఆశలకి తగ్గట్టే అకిరా సినీ ఎంట్రీ గ్యారంటీగా ఉంటుందనే వార్తలు సినీ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. దీంతో అకిరా గ్రాండ్ ఎంట్రీపై అభిమానులు పలు రకాలుగా ఊహించుకుంటూ వస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా అకిరా యాక్ట్ చేసినట్టుగా చెప్తున్న 'ఏ ఐ లవ్ స్టోరీ'(Ai Love Story)అనే చిత్రం తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.
చాలా మంది అకిరా నుంచి వచ్చిన ఫస్ట్ మూవీగా భావించారు. కానీ అకిరా ఆ చిత్రంలో చెయ్యలేదు. టెక్నాలజీ ని ఉపయోగించి అకిరా పేస్, గొంతుని మార్ఫింగ్ చేసి యూ ట్యూబ్ లో ఉంచారు. ఈ విషయం తెలియగానే ఫ్యాన్స్ షాక్ అవ్వడం కూడా జరిగింది. దీంతో అకిరా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి సదరు ఏఐ లవ్ స్టోరీ పై తన ప్రమేయం లేదని విన్నవించుకోవడం జరిగింది.
సదరు మొత్తం విషయంపై రీసెంట్ గా హైకోర్టు స్పందిస్తు 'ఏ ఐ లవ్ స్టోరీ' చిత్రాన్ని సోషల్ మీడియా సంస్థలు యూ ట్యూబ్ నుంచి వెంటనే తొలగించాలి. భవిష్యత్తులో అయినా అకిరా నందన్ అనుమతి లేకుండా అతని పేరు,ఫోటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఎలాంటి ఏఐ లేదా డీప్ కంటెంట్ తయారు చేయకూడదని హైకోర్ట్ తన తీర్పుని ప్రకటించింది. దీంతో అకిరా తో పాటు అభిమానులకి పెద్ద రిలీఫ్ వచ్చినట్లయింది.
Also read: ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్.. ఇండస్ట్రీ ని ఏలుతావా!
అకిరా పేరుతో యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఇనిస్టా, ఎక్స్ లలో ఉన్న నకిలీ ప్రొఫైల్స్ పేజీలని కూడా తొలగించాలనే అకిరా మరో అభర్ధనని కూడా హైకోర్టు యాక్సెప్ట్ చేసి అందుకు తగట్టుగా తీర్పుని వెల్లడి చేసింది.
![]() |
![]() |