![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. శంకర్ తల్లి నిమ్మల సక్కుబాయమ్మ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు(జనవరి 28) తుది శ్వాస విడిచారు. అంతిమ సంస్కారాలు రేపు మధ్యాహ్నం జరగనున్నాయి. (Director N Shankar)
సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న అరుదైన దర్శకులలో శంకర్ ఒకరు. 1997లో 'ఎన్‌కౌంటర్' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం, జై బోలో తెలంగాణా వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. తెలుగు సినీ దర్శకుల సంఘం అద్యక్షుడిగానూ పని చేశారు.
![]() |
![]() |