![]() |
![]() |

-బెంగాల్ గవర్నర్ తీసుకున్న నిర్ణయమేంటి
-అభిమానులు హ్యాపీ
-తెలుగు వారికి గుర్తింపు వచ్చిందా!
నటప్రపూర్ణ 'మోహన్ బాబు'(Mohan Babu)కి ఉన్న సినీ చరిష్మా తెలుగు సినిమా ఇండస్ట్రీ బతికి ఉన్నంత వరకు ఉంటుంది. ఈ సత్యాన్ని కాదనగలిగే తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు. అంతలా ఐదు దశాబ్దాల నుంచి ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మననమవుతు వస్తున్నాడు. సుదీర్ఘ కాలం నుంచి విద్యా సంస్థల అధినేతగా కూడా తక్కువ ఖర్చుకే నాణ్యమైన విద్యని అందించే మోహన్ బాబు గత ఏడాది తనయుడు విష్ణు తో కలిసి 'కన్నప్ప' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీసెంట్ గా జరిగిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోహన్ బాబు ని పశ్చిమ బెంగాల్ గవర్నర్ విశిష్ట పురస్కారం తో గౌరవించడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
అట్టడుగు స్థాయి నుంచి నటుడిగా ఐదు దశాబ్దాల నుంచి రాణిస్తూ ఉండటం,విద్యా దాత్రుత్వంలో సమాజంపై చెరగని ముద్ర నెలకొల్పడంతో మోహన్ బాబు కి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆఫ్ ఎక్స్ లెంట్ అవార్డు అందుకున్నారు. స్వయంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ నే సదరు పురస్కారాన్ని అందివ్వడం విశేషం. అవార్డు కార్యక్రమంలో విష్ణు కూడా పాల్గొన్నాడు. సినీ పరిశ్రమకి చెందిన పలువురు మోహన్ బాబు కి అభినందనలు తెలుపుతున్నారు. 2022 నుంచి వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తు వస్తున్న వాళ్ళకి పశ్చిమ బెంగాల్ ప్రభుతం తన రాష్ట్రం పేరుపై ఎక్స్ లెంట్ అవార్డుని అందిస్తు వస్తున్నారు.
Also read: అకిరా నందన్ ఫస్ట్ మూవీకి షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
![]() |
![]() |