![]() |
![]() |

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా 'తెలిసిన వాళ్లు'. సిరింజ్ సినిమా బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి విప్లవ్ కోనేటి దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. 'నన్ను నేను చంపుకోబోతున్నాను' అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్ తో ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది.
'తెలిసిన వాళ్లు' సినిమాకు సంబంధించి గతంలో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. రామ్ కార్తీక్ కాఫీ కప్ లో కూర్చొని ఒక చేతిలో కాఫీ కప్, మరో చేతిలో బిస్కెట్ పట్టుకున్న లుక్ ఆకట్టుకుంది. ఇక హెబ్బా పటేల్ ఫస్ట్ లుక్ అయితే కుర్చీలో మొండెం, అద్దంలో తలతో విభిన్నంగా అందరి దృష్టించి ఆకర్షించింది. ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంటోంది. ఇందులో హెబ్బా పటేల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తోంది. ఈ సినిమా కాపుచినో లాంటి అబ్బాయి, ఫిల్టర్ కాఫీ లాంటి అమ్మాయి మధ్య జరిగే కథ అని గ్లింప్స్ ని బట్టి అర్థమవుతోంది. 'నన్ను నేను చంపుకోబోతున్నాను' అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కి హైలైట్ గా నిలిచింది.

శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.
![]() |
![]() |