![]() |
![]() |

కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కాబోయే భార్యను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని ట్విట్టర్ షేర్ చేసి సర్ ప్రైజ్ చేశాడు.
'అర్జున్ రెడ్డి' సినిమాలో శివ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. ఆ తర్వాత 'భరత్ అనే నేను', 'గీత గోవిందం', 'బ్రోచేవారెవరురా', 'జాతిరత్నాలు', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రాహుల్.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా అర్జున్ రెడ్డి స్టైల్ లో తన పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
'ఎట్టకేలకు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను' అంటూ తనకు భార్యకు లిప్ కిస్ పెడుతూ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. నెటిజన్లు, సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు.
![]() |
![]() |