![]() |
![]() |
.webp)
మలయాళంలో మంచి విజయం సాధించిన 'ఉడుంబు' తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. ఈయన ఇంతకుముందు అంజలి టైటిల్ పాత్రలో 'చిత్రాంగద', సుమంత్ తో 'ఇదం జగత్' ఛార్మితో 'మంత్ర', 'మంగళ' వంటి పలు చిత్రాలతోపాటు... సుకుమార్ 'కుమారి 21ఎఫ్' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయం సొంతం చేసుకున్నారు. తాజాగా రమ్యకృష్ణతో కన్నడలో 'శివగామి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఉడుంబు' చిత్రాన్ని మలయాళంలో కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన 'ఉడుంబు' మలయాళంలో అనూహ్య విజయం సాధించింది.
పలు అగ్రనిర్మాణ సంస్థలు "ఉడుంబు" తెలుగు రీమేక్ రైట్స్ కోసం పోటీపడినప్పటికీ... ఈ చిత్రం హక్కులు తమకు దక్కడంపై నిర్మాత గంగపట్నం శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి రత్నాకరం అనిల్ రాజు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.
ఇప్పటివరకు మలయాళంలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన చిత్రాలు దాదాపుగా అన్నీ ఇక్కడ కూడా అఖండ విజయం సాధించాయి. విక్టరీ వెంకటేష్ 'దృశ్యం', 'దృశ్యం 2'లతో పాటు ఇటీవల విడుదలై అప్రతిహత విజయం సాధిస్తున్న 'భీమ్లా నాయక్' ('అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్) ఇందుకు తాజా ఉదాహరణ. అలాగే మెగాస్టార్ నటిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రం కూడా మలయాళంలో రూపొంది సంచలన విజయం సాధించిన 'లూసిఫర్'కు రీమేక్ అన్న విషయం కూడా ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలో మళయాళంలో మంచి హిట్టయిన సినిమాలకు తెలుగులో మరింత క్రేజ్ ఏర్పడుతోంది.

భారీ తారాగణం లేకున్నా మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన 'ఉడుంబు' చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా... తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు. మరి ఇంతటి సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న 'ఉడుంబు' తెలుగు రీమేక్ రైట్స్ ఎవరి సొంతం కానున్నాయో వేచి చూడాల్సిందే!
![]() |
![]() |