![]() |
![]() |

ప్రస్తుతం రానా పెళ్లి పనుల్లో ఉన్నాడు. పైగా, అతడి సినిమా షూటింగులు కూడా మళ్లీ మొదలు కాకపోవడం కలిసి వచ్చే అంశం. కరోనా తీవ్రత కారణంగా పెద్ద సినిమా షూటింగులు స్టార్ట్ కాలేదు. పరిస్థితులు మరింత సాధారణ స్థితికి వచ్చిన తరవాత షూటింగులు స్టార్ట్ చేద్దామని స్టార్ హీరోలు, భారీ సినిమా యూనిట్స్ వేచి చూస్తున్నాయి. ఒక్కసారి పరిస్థితులు చక్కబడిన తరవాత షూటింగులు స్టార్ట్ చేసే వాతావరణం ఏర్పడితే 'హిరణ్యకశ్యప' స్టార్ట్ చేయాలని గుణశేఖర్ ఎదురు చూస్తున్నారు. రానా రెడీ అంటే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆయన రెడీ.
"హిరణ్యకశ్యప ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది. ముందుకు వెళ్లడానికి సాధారణ పరిస్థితులు వస్తాయని వేచి చూస్తున్నా" అని గుణశేఖర్ ట్వీట్ చేశారు. 'రుద్రమదేవి' విడుదల తర్వాత నుండి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు ఆయన. దాదాపుగా మూడేళ్ల నుండి స్క్రిప్ట్ వర్క్ నిమగ్నం అయ్యారు. ఇందులో హిరణ్యకశ్యపుడి పాత్రలో రానా నటించనున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఆయన 'విరాటపర్వం' చేస్తున్నారు. ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. పెళ్లి తరవాత ముందు ఈ షూటింగ్ కంప్లీట్ చేసి, తర్వాత 'హిరణ్య కశ్యప' స్టార్ట్ చేస్తారట.
![]() |
![]() |