![]() |
![]() |

దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి పనులు అధికారికంగా మొదలైనట్లే. మిహీకా బజాజ్ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేశారు. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ అనుకున్నారంతా! అయితే, లగ్న పత్రిక వేడుక జరిగినప్పటి ఫొటోలు అవి. ఇటీవల ఓ గుడిలో ఆ కార్యక్రమం సింపుల్‌గా కానిచ్చారు. ఆషాఢ మాసం ప్రారంభానికి ముందే పెళ్లి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ప్రస్తుతానికి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అయితే, పెళ్లికి అదొక ఆప్షన్ మాత్రమే. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికీ పెళ్లికి 50మందికి మించరాదనే నిబంధన ఉంది. ఆగస్టు 8న రానా పెళ్లి సమయానికి కరోనా తగ్గుముఖం పట్టకపోతే ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించే అవకాశాలు కష్టమే. అందుకని, ఇతరత్రా ఆప్షన్స్ కూడా చూస్తున్నారట. పరిస్థితులు అనుకూలిస్తే ఎక్కువమందిని పిలిచి అక్కడ పెళ్లి చేస్తారు. లేదంటే మరో చోట సింపుల్‌గా చేస్తారు. వెంకటేష్ తన కుమార్తె పెళ్లిని జైపూర్‌లో తక్కువమందితో చేసిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. అలా ఫలక్‌నుమా ప్యాలస్‌లో తక్కువ మందితో చేసే అవకాశాలను తీసి పారేయలేం.
![]() |
![]() |