![]() |
![]() |

అనతికాలంలోనే హిందీనాట అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆలియా భట్. వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. స్వల్ప విరామం అనంతరం `గంగూబాయి కథియావాడి`తో వెండితెరపై సందడి చేయబోతోంది. స్టార్ కెప్టెన్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా.. 157 నిమిషాల (2 గంటల 37 నిమిషాలు) నిడివితో రేపు (ఫిబ్రవరి 25) థియేటర్స్ లోకి రాబోతోంది. తెలుగులోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనువాద రూపంలో అలరించనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఫిబ్రవరి నెల ఆలియా భట్ కి కలిసొచ్చిన నెల అనే చెప్పాలి. ఇదివరకు ఆలియా నాయికగా నటించిన `హైవే` (2014), `గల్లీ బాయ్` (2019) వంటి చిత్రాలు ఇదే నెలలో జనం ముందు నిలిచాయి. ఈ రెండు సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కాసుల జల్లు కురిపించాయి. మరి.. `గంగుబాయి కథియావాడి`కి ఆలియా ఫిబ్రవరి సెంటిమెంట్ తోడై మరో కమర్షియల్ హిట్ తన ఖాతాలో చేరుతుందేమో చూడాలి. అలాగే, `గల్లీ బాయ్` తరువాత సాలిడ్ హిట్ లేని ఆలియాకి `గంగూబాయి`తో ఆ లోటు తీరుతుందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.
ఇదిలా ఉంటే, ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న థియేటర్స్ లోకి రానుంది.
![]() |
![]() |