![]() |
![]() |

ఈ సెప్టెంబర్ 25న 'ఓజీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'గన్స్ ఎన్ రోజెస్' అనే సాంగ్ విడుదలైంది. (They Call Him OG)
'ఓజీ' కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీస్ట్ మోడ్ కి వెళ్లిపోయాడని చెప్పవచ్చు. ముఖ్యంగా 'ఫైర్ స్ట్రామ్', 'ట్రాన్స్ ఆఫ్ ఓమి' సాంగ్స్ కి పవర్ ఫుల్ మ్యూజిక్ అందించిన తమన్.. ఇప్పుడు 'గన్స్ ఎన్ రోజెస్' కి కూడా అదే రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇంగ్లీష్ లిరిక్స్ తో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న గంభీర పాత్రను ఎలివేట్ చేసేలా ఈ పాట సాగింది. మ్యూజిక్, లిరిక్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని చెప్పవచ్చు. (Guns N Roses)
ప్రస్తుతం ఎక్కడా చూసినా 'ఓజీ' పేరు మారుమోగిపోతోంది. సినిమా విడుదలకి ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ లో జోరు పెంచుతోంది మూవీ టీం. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు కావడం ఖాయమంటున్నారు.
![]() |
![]() |