![]() |
![]() |

ఈ శుక్రవారం బాలీవుడ్ నుంచి రెండు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ సందడి చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ భాగమతికి రీమేక్ గా తెరకెక్కిన దుర్గామతితో పాటు ఇందూ కీ జవానీ అనే మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన దుర్గామతి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాగా.. కియారా అద్వాని టైటిల్ రోల్ లో నటించిన ఇందూ కీ జవానీ ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో రిలీజైంది.
అయితే చిత్రంగా.. ఈ రెండు సినిమాలకు కూడా నెగటివ్ రివ్యూస్ నే వచ్చాయి. ఒరిజినల్ కి ఏ మాత్రం మ్యాచ్ అయ్యేలా లేకపోవడంతో దుర్గామతికి విమర్శల పాలైంది. చూసిన వీక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇక ఇందూ కీ జవానీ గురించి కూడా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. కియారా అందాల విందు తప్ప సినిమాలో మరోటి లేదని.. థియేటర్స్ లో జనాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారని బాలీవుడ్ ట్రేడ్ టాక్.
మొత్తంగా.. డిసెంబర్ 11న వేర్వేరు ప్లాట్ ఫామ్స్ లో రిలీజైన దుర్గామతి, ఇందూ కీ జవానికి సేమ్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట.
![]() |
![]() |