![]() |
![]() |

యశ్ హీరోగా నటించగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' హిందీ వెర్షన్ బాక్సాఫీస్ దగ్గర అసాధారణ ఫలితాలను సాధిస్తూ దూసుకుపోతోంది. సంజయ్ దత్ విలన్‌గా, రవీనా టాండన్ ప్రధానమంత్రిగా నటించిన ఈ మూవీ హిందీ వెర్షన్ తొలివారం కలెక్షన్ విషయంలో డైరెక్ట్ లేదా డబ్బింగ్ సినిమాలన్నింటిలోనూ నంబర్ వన్‌గా నిలిచింది. మొదటివారమే ఈ సినిమా రూ. 250 కోట్ల క్లబ్బులో చేరడం అతి పెద్ద విశేషం. బుధవారం ఏడవ రోజు ఈ సినిమా రూ. 16.35 కోట్ల నెట్‌ను సాధించింది. దాంతో ఈ సినిమా వసూళ్లు రూ. 255.05 కోట్లకు చేరుకున్నాయి.
హిందీలో రూ. 250 కోట్ల మార్కును అతివేగంగా చేరుకున్న రికార్డు ఇదివరకు ప్రభాస్ 'బాహుబలి 2' పేరిట ఉంది. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా 8 రోజుల్లో ఆ ఫీట్ సాధించింది. ఇదే మార్కును అందుకోవడానికి ఆమిర్ ఖాన్ 'దంగల్'కు 10 రోజులు, రణబీర్ కపూర్ 'సంజు'కు 10 రోజులు, సల్మాన్ ఖాన్ మూవీ 'టైగర్ జిందా హై'కి 10 రోజులు పట్టాయి.
బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేస్తోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' తొలివారం వసూళ్లు రోజుల వారీగా ఎలా ఉన్నాయంటే...
గురువారం రూ. 53.95 కోట్లు
శుక్రవారం రూ. 46.79 కోట్లు
శనివారం రూ. 42.90 కోట్లు
ఆదివారం రూ. 50.35 కోట్లు
సోమవారం రూ. 25.57 కోట్లు
మంగళవారం రూ. 19.14 కోట్లు
బుధవారం రూ. 16.35 కోట్లు
![]() |
![]() |