![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా `గని`గా పలకరించాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన సదరు చిత్రంలో బాక్సర్ గా ఎంటర్టైన్ చేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3`తో సందడి చేయనున్నాడు వరుణ్. మే 27న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాలో పైలట్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు వరుణ్. లండన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో `డాక్టర్` విలన్ వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాదు.. వరుణ్, వినయ్ మధ్య సాగే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయంటున్నారు. త్వరలోనే వరుణ్ తేజ్ - ప్రవీణ్ సత్తారు కాంబో మూవీలో వినయ్ రాయ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం సీనియర్ స్టార్ కింగ్ నాగార్జునతో `ద ఘోస్ట్` మూవీ తీస్తున్నాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇదే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. ఇందులో నాగ్ కి జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది.
![]() |
![]() |