![]() |
![]() |

యష్ వన్ మాన్ షో 'టాక్సిక్' ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న విషయం తెలిసిందే. డివైడ్ టాక్ హోదాని తొలి ఆట నుంచే దక్కించుకోవడంతో వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా సాగుతున్నాయి. టాక్సిక్ థియేట్రికల్ హక్కులని రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దిల్ రాజు' దక్కించుకున్నాడు. దీంతో దిల్ రాజుకి భారీ నష్టాలు తప్పవంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
కొంత ముందైతే ఏకంగా 100 కోట్ల వరకు నష్టం వస్తుందని పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దిల్ రాజు డీల్ సాధారణ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు తరహాలో జరగలేదని, రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన తీసుకున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపిస్తోంది. ఈ విధానం ప్రకారం సినిమా నిర్ణీత బాక్సాఫీస్ టార్గెట్‌ను చేరుకోలేక నష్టం వస్తే, ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని నిర్మాతలు లేదా సంబంధిత పక్షాలు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.
Also Read: జాన్వీకపూర్ ఆ హీరోని రహస్యంగా పెళ్లి చేసుకుందా.. ఈ వీడియోనే అందుకు సాక్ష్యమా!
అయితే ఈ లెక్కలు, ఒప్పంద వివరాలపై చిత్రబృందం లేదా దిల్ రాజు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందువల్ల ప్రస్తుతం వైరల్ అవుతున్న మొత్తాలను అధికారికంగా ధ్రువీకరించిన సమాచారం కంటే రూమర్స్ అని చెప్పవచ్చు. ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం, ‘టాక్సిక్’ సినిమా ద్వారా నష్టం వస్తే ఆ మొత్తాన్ని 45 రోజుల్లో తిరిగి చెల్లించే విధంగా ఒప్పందం జరిగినట్లు కూడా సమాచారం. ఇదే నిజమైతే సినిమా ఫలితంతో దిల్ రాజుకు వచ్చే ఆర్థిక రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. తెలుగు హక్కులు 120 కోట్లని ప్రచారం జరిగినా 80 కోట్లకి డీల్ కుదిరిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Dil Raju, yash, Toxic, Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews TeluguOneDotCom
![]() |
![]() |