Home  »  News  »  మెగాస్టార్ చిరంజీవి కాపాడబోతున్నాడా!

Updated : Aug 27, 2026

 

 

అభిమానుల కలలని నిజం చేస్తూ నిన్న వరల్డ్ వైడ్ గా టాక్సిక్ ల్యాండ్ అయ్యింది.  మెజారిటీ ప్రేక్షకుల మౌత్ టాక్ డిజాస్టర్.. కాకపోతే యష్ పెర్ ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రేంజ్ లో ఉన్నాయనే మాటలు కూడా మెజారిటీ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. టాక్సిక్ ని నిర్మించింది కెవిఎన్ ప్రొడక్షన్స్ .

ఇళయ దళపతి విజయ్ జన నాయగన్ ని నిర్మించింది కూడా కె వి ఎన్ సంస్థనే. జన నాయగన్ సైతం డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాల బడ్జెట్ సుమారు 1000 కోట్లు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న  మెగాస్టార్ చిరంజీవి 'కాకా' ని  కెవిఎన్ ప్రొడక్షన్స్ నే నిర్మిస్తుంది. చిరు కెరీర్ లోనే హై బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటుండంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. టాక్సిక్, జన నాయగన్ డిజాస్టర్స్ గా నిలవడంతో  'కాకా' పై ప్రతికూల ప్రభావం పడుతుందా అనే  ఆందోళనలో కొంత మంది  చిరు అభిమానులు ఉన్నారు. బిజినెస్ పరంగాm ప్రమోషన్స్ పరంగా రిస్క్ అవుతుందేమోనన్న టెన్షన్ కూడా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి  కానీ కొంత మంది అభిమానులైతే అక్కడ ఉన్న కట్ అవుట్ పేరు చిరంజీవి.. బడా హీరోల సినిమాలు కె వి ఎన్ కి కలిసి రావేమో అనే సెంటిమెంట్ ఆమడదూరంలో ఆయిల్ మెంట్ రాకుండా ఉండాల్సిందే అని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిలీజైన 'కాకా' టీజర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది.  

Also Read: Toxic: టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 


 2021 వ సంవత్సరంలో 'సకత్' మూవీతో  తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ 2022 లో  'బై టూ లవ్' నిర్మించింది. ఆ రెండు చిత్రాలు ఏవరేజ్.  అయితే 2026 ఏడాది మాత్రం ఈ బ్యానర్‌కు అసలైన పరీక్షగా మారింది.  'కల్ట్', కెడి: ది డెవిల్',  జన నాయగన్ ,టాక్సిక్  బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

Toxic, yash, Chiranjeevi, Kaaka,Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews TeluguOneDotCom






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.