![]() |
![]() |

సెల్యులాయిడ్ పై మొట్టమొదటి తెలుగు నేషనల్ అవార్డ్ విన్నర్ 'ఐకాన్ స్టార్ అల్లు అర్జున్' బొమ్మ ఉన్నా లేకపోయినా తన 'ఆరా' మాత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా మరో చారిత్రాత్మక ఘనతని అల్లు అర్జున్ అందుకున్నాడు.
ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా '100 బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ 2026' కవర్ స్టార్‌గా నిలిచి తగ్గేదేలే అనే తన మేనరిజానికి మరోసారి పాన్ ఇండియా వ్యాప్తంగా అదనపు అర్హత తీసుకొచ్చాడు ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరవడం కేవలం ఒక నటుడిగా ఆయన సాధించిన విజయమే కాకుండా దక్షిణ భారతదేశం నుండి ఎదిగిన ఒక నటుడు, దేశంలోనే అతిపెద్ద సెలబ్రిటీ బ్రాండ్‌గా రూపాంతరం చెందడం సినీ వర్గాల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ పెద్ద సంచలనంగా మారింది. దీన్ని బట్టి ఇండియన్ సినిమా వ్యాపారాన్ని అల్లు అర్జున్ ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.
Also read: మెగాస్టార్ చిరంజీవి కాపాడబోతున్నాడా!
అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినా మరియు బ్రాండ్ వ్యాల్యూ గడిచిన కొన్నేళ్లలో ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకాయి. పుష్ప సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకుని ట్రెండ్ సెట్ చేశాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల పరంగా కూడా ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు . కేవలం ప్రకటనల రూపంలోనే ఒక్కో బ్రాండ్‌కి 4 కోట్ల వరకు వసూలు చేస్తూ, దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న కమర్షియల్ ఫేస్‌గా మారారు. సంపాదించిన హోదా, డబ్బు తిరిగి సినిమాకే ఉపయోగపడాలని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అల్లు స్టూడియోస్, టెక్నాలజీ హంగులతో నిర్మించిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్, అలాగే వ్యాపార భాగస్వామ్యాలు ఆయన వార్షిక ఆదాయాన్ని మరియు బ్రాండ్ సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరింపజేస్తున్నాయి. గడిచిన దశాబ్ద కాలంగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో నిరంతరం చోటు సంపాదిస్తూ వస్తున్న అల్లు అర్జున్, 2026 నాటికి 100 మంది అతిపెద్ద ఇండియన్ సెలబ్రిటీలలో ముఖచిత్రంగా నిలవడం ఒక రికార్డు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒక ప్రాంతీయ నటుడు గ్లోబల్ ఐకాన్‌గా ఎదగడం తెలుగు సినిమా గర్వించదగ్గ మైలురాయి. ప్రస్తుతం 'రాకా'తో బిజీగా ఉన్నాడు.
Allu Arjun, Forbes India, Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews TeluguOneDotCom
![]() |
![]() |