![]() |
![]() |

లవకుశ.. తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకుడు నేటికీ తమ గుండెల్లో గుడిలా నింపుకొని పూజిస్తున్న అరుదైన దృశ్య కావ్యం. సీతారాముల కథ, కుశ, లవుల భక్తి, వాత్సల్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. ఏ థియేటర్ లో ఆడుతుందో ఆ థియేటర్ కి చుట్టూ పక్కన ఉన్న గ్రామాల ప్రజలు ఎడ్ల బళ్ళు కట్టుకొని, క్యారేజ్ లో అన్నం నింపుకొని ఎదురొచ్చిన వాళ్లకి లవకుశకి వెళ్తున్నామని గర్వంగా చెప్తూ వెళ్లేవారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇరుముడి మూవీకి రిపీట్ అవుతుంది.
థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రేక్షకులు 'ఇరుముడి' చూస్తుంటే 'లవకుశ' చూసినట్టు ఉందని, లవకుశ లో రాముడి పట్ల పిల్లలకి ఉండే భక్తి, హృదయ నాళాన్ని తాకే సన్నివేశాలు, పాటలు ఏ విధంగా కన్నీళ్లు పెట్టించాయో, ఇరుముడిలో కూడా తండ్రి బాధ్యత, కూతురు ఆశయం, అయ్యప్ప స్వామి శరణువేడుడు ఘట్టాలు అదే స్థాయిలో కంటతడి పెట్టిస్తున్నాయని భావోద్వేగంతో చెప్తున్నారు. దీన్ని బట్టి వయసుతో తారతమ్యం లేకుండా ఇరుముడి ఎంతటి ప్రేక్షక, జన ప్రభంజనాన్ని సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా 10 ఏళ్ల లోపు పిల్లలు, వాళ్ళ తల్లితండ్రులు చలో టూ ఇరుముడి అంటున్నారు. సినిమా చూసిన దాదాపు 95% మంది ప్రేక్షకులు ఇది కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదని, ఒక గొప్ప కుటుంబ కథా చిత్రం అని ప్రశంసిస్తున్నారు.
Also Read: ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్.. బాక్సాఫీస్ కింగ్ కొత్త చరిత్ర
శబరిమల అయ్యప్ప స్వామి వారి భక్తిపథం, తండ్రీ కూతురు బంధం, నేటి సమాజంలో అసాంఘిక శక్తులు వల్ల ఆడవారి పట్ల, చిన్న పిల్లలు ఎదుర్కుంటున్న లైంగిక దాడి , మనుషుల మధ్య తగ్గుతున్న నమ్మకం, మానవీయ విలువల చుట్టూ 'ఇరుముడి' కథ తిరుగుతుంది.ప్రతిఒక్కరి ప్రకృతి సిద్దమైన పెర్ ఫార్మెన్స్ , అయ్యప్ప స్వామి మహత్యం ప్రతి ఒక్కరి హృదయాలని బలంగా తాకుతున్నాయి. . ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే 45 నిమిషాల ఎమోషనల్ సీన్లు, అయ్యప్ప స్వామి పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. ఇరుముడి కట్టుకుని శబరిమల కొండలు ఎక్కేటప్పుడు ఆ అయ్యప్ప భక్తులు అనుభవించే ఆధ్యాత్మిక అనుభూతిని ఇరుముడి చూస్తూ పొందుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉందంటే ఇరుముడి ఇంకా చూడలేదని తమ పక్కింటోళ్ళకి చెప్తే నామూషిగా ఫీలయ్యే పరిస్థితి.
Lavakusa, irumudi, Tollywood, TeluguCinema, TeluguNews ,TeluguCinemaNews, TeluguOneDotCom
![]() |
![]() |