![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ‘ఇరుముడి’ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
‘ఇరుముడి’తో బ్లాక్ బస్టర్ సాధించిన సోదరుడు రవితేజకు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. “సినిమాను మొదటి నుండి చివరి వరకు ఎంజాయ్ చేశాను. రవితేజ ‘త్రినాథ్’ పాత్రను తన భుజాలపై అద్భుతంగా మోశారు. వాట్ ఎ ఫినామినల్ పెర్ఫార్మెన్స్.” అంటూ రవితేజ యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అంతేకాదు, ఈ సినిమాను ఎంతో లోతుగా, ఎమోషనల్‌గా తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ పనితనాన్ని మెగాస్టార్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అలాగే, సినిమాలో కీలక పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రకు తన ఆశీస్సులు అందిస్తూ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు, చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ ట్వీట్ లో చిరంజీవి రాసుకొచ్చిన కొన్ని లైన్స్ హాట్ టాపిక్ గా మారాయి. "ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!" అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.
ఇటీవల కొందరు సోషల్ మీడియాలో 'తొక్కేశారు' అంటూ కావాలని చిరంజీవిపై నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కౌంటర్ గానే చిరు ఈ ట్వీట్ లో ఆ మాటలను జోడించారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
https://x.com/KChiruTweets/status/2092882989680337188
[Chiranjeevi, Ravi Teja, Irumudi, Shiva Nirvana, Mythri Movie Makers]
![]() |
![]() |