![]() |
![]() |

మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా 'హీరో' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 15 న విడుదలైన హీరో సినిమాతో ఆకట్టుకున్న అశోక్ తన తదుపరి సినిమా కథా చర్చల్లో బిజీగా ఉన్నాడు. జూన్ లోపు తన కొత్త సినిమాని ప్రకటిస్తానంటున్న అశోక్.. తన మేనమామ మహేష్ సినిమాల్లో 'మురారి' రీమేక్ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు.
ఏప్రిల్ 5 న తన పుట్టినరోజు కావడంతో తాజాగా మీడియాతో ముచ్చటించిన అశోక్.. హీరో సినిమాతో పాటు తన తదుపరి సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'హీరో'కి సంక్రాంతి సినిమాకి రావాల్సినంత రెస్పాన్స్ రాలేదని, దానికి కారణం కరోనా థర్డ్ వేవ్ అని అన్నాడు. మార్చిలో వస్తుందనుకున్న వేవ్ జనవరిలో రావడంతో కొందరు ప్రేక్షకులు థియేటర్స్ కి రాలేదని చెప్పుకొచ్చాడు. కానీ సినిమా చూసిన వారంతా బాగుంది అన్నారని, థియేటర్ లో మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసి ఫుల్ కాల్స్, మెసేజెస్ చేసి ప్రశంసిస్తున్నారని అన్నాడు. తన తాతగారు కృష్ణ, అలాగే మహేష్ కూడా సినిమా చూసి మెచ్చుకున్నారని అశోక్ తెలిపాడు.
తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదని, కొన్ని కథలు విన్నానని, త్వరలోనే నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేస్తామని అశోక్ చెప్పాడు. తాను కేవలం కమర్షియల్ హీరోగా ఉండాలనుకోవడం లేదని, డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందని, ముఖ్యంగా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టమని తెలిపాడు. అలాగే తనకి మహేష్ మామ సినిమాల్లో 'మురారి' చాలా ఇష్టమని, ఒకవేళ ఆయన సినిమా రీమేక్ చేయాల్సి వస్తే మురారినే రీమేక్ చేస్తానని అన్నాడు. ఆ సినిమా స్టోరీ బాగుండటంతో పాటు పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటుందని అశోక్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |