![]() |
![]() |
.webp)
విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సమంత హాజరు కాలేదు. ఫారెన్ టూర్ లో ఉండటంతో ఆమె హాజరు కాలేదని తెలుస్తోంది. కానీ విజయ్ మాత్రం మూవీ లాంచ్ కి సమంత వచ్చిందని, ఫోటోలు సరిగా చూడాలని అంటున్నాడు.
ఈ మూవీలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారిద్దరూ కూడా మూవీ లాంచ్ కి రాలేదు. అయితే విజయ్ మాత్రం సమంతతో పాటు ఈ ఇద్దరు కూడా వచ్చారు అంటూ ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఫోటో షాప్ లో ఈ ముగ్గురి ఫోటోలను యాడ్ చేసి ఇదే అసలు ఫోటో అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ని సమంత స్మైలీ ఏమోజీలతో ఈ రీట్వీట్ చేసింది.

ఇక విజయ్ షేర్ చేసిన మరో ఫోటో నవ్వులు పూయిస్తుంది. తను వేరే వారితో దిగిన ఫోటోలో ఫేసులని ఎడిట్ చేసి వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఫేసులను పెట్టాడు. దీంతో ఇదెక్కడి ఫోటోషాప్ మామ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

![]() |
![]() |