![]() |
![]() |

'తెలుగువన్' అధినేత కంఠంనేని రవిశంకర్.. వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు, వందల మందిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అవకాశాలు ఇవ్వడంలోనే కాదు.. కొత్త వారిని ప్రోత్సహించడంలో కూడా రవిశంకర్ ముందుంటారు. తాజాగా ఆయన యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ 'బిగ్ బ్రదర్' మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
విభిన్న చిత్రాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న శివ కంఠంనేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'బిగ్ బ్రదర్'. జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె. శివశంకర రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బారావు గోసంగి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ 'తెలుగువన్' అధినేత కంఠంనేని రవిశంకర్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా ట్రైలర్ బాగుందని ప్రశంసించిన ఆయన, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

రెండు కుటుంబాల మధ్య వైరం నేపథ్యంలో యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా 'బిగ్ బ్రదర్' చిత్రం రాబోతుంది. యాక్షన్, రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలతో పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాను అందించబోతున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
'బిగ్ బ్రదర్' చిత్రంలో శివ కంఠంనేనితో పాటు శ్రీ సూర్య, ప్రియా హెగ్డే, ప్రీతి శుక్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవ్ సింగ్, హ్యారీ జోష్, గౌతమ్ రాజ్, గుండు సుదర్శన్, ఖుష్బూ తదితరులు ముఖ్య పాత్రలలో అలరించనున్నారు.
ఓం ఝా స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు-సాహిత్యం దుర్గా ప్రసాద్ అందిస్తున్నారు. సూర్య ప్రకాష్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఎడిటర్ గా సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ గా షేర వ్యవహరిస్తున్నారు. జీభు నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

తారాగణం: శివ కంఠంనేని, శ్రీ సూర్య, ప్రియా హెగ్డే, ప్రీతి శుక్లా, దేవ్ సింగ్, హ్యారీ జోష్, గౌతమ్ రాజ్, గుండు సుదర్శన్, ఖుష్బూ తదితరులు
రచన, దర్శకత్వం: సుబ్బారావు గోసంగి
సమర్పణ: జి. రాంబాబు యాదవ్
బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
నిర్మాతలు: కె. శివశంకర రావు, ఆర్. వెంకటేశ్వర రావు
సంగీతం: ఓం ఝా
నేపథ్య సంగీతం: జీభు
డీఓపీ: సూర్య ప్రకాష్
ఎడిటర్: సంతోష్
ఆర్ట్ డైరెక్టర్: షేర
కొరియోగ్రఫీ: రాజ్ పైడి
ఫైట్ మాస్టర్: రామకృష్ణ
![]() |
![]() |