![]() |
![]() |

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ (Prabhas) పెళ్లి గురించి చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. దానికి కారణం తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ ఓ స్టోరీ పెట్టాడు. "డార్లింగ్స్.. మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి" అంటూ రాసుకొచ్చాడు. దీంతో ప్రభాస్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని, తన లైఫ్ పార్టనర్ గురించి ఈ స్టోరీ పెట్టాడని అందరూ భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) కూడా డార్లింగ్ అంటూ ఓ పోస్ట్ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టడానికి కొద్ది గంటల ముందు.. సోషల్ మీడియాలో ఒక రీల్ షేర్ చేసిన పాయల్.. "నేను ఖచ్చితంగా ఒకరి డార్లింగ్ ని.. ఎనీ గెస్?" అంటూ రాసుకొచ్చింది. మొదట ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురించో లేక ఏదైనా మూవీ ప్రమోషన్ కోసమో పోస్ట్ చేసి ఉంటుందని భావించారంతా. కానీ ఎప్పుడైతే ప్రభాస్ "డార్లింగ్స్.. స్పెషల్ పర్సన్ రాబోతున్నారు" అంటూ స్టోరీ పెట్టాడో.. ఒక్కసారిగా పాయల్ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. "ప్రభాస్, పాయల్.. సంథింగ్ సంథింగ్..." అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు యాదృచ్ఛికంగా పోస్ట్ చేశారా? లేక ఏమైనా హింట్ ఇస్తున్నారా? లేక ఏదైనా కొత్త మూవీ ప్రమోషనా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు చేసిన డార్లింగ్ పోస్ట్ లు మాత్రం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

![]() |
![]() |