![]() |
![]() |

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప..పరమేశ్వరుడి కళ్ళ వెంట రక్తం కారుతుంటే దాన్ని ఆపటానికి తన రెండు కళ్ళు సమర్పించి భక్త కన్నప్ప గా మారిన తిప్పడి జీవిత కథ ఆధారంగా కన్నప్ప తెరకెక్కుతుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి పాన్ ఇండియా నటుల చేరికతో కన్నప్ప రేంజ్ హిమాలయ శిఖరాలంత ఎత్తుకి చేరింది. అది ఎంతలా అంటే చాలా మంది నటులు కన్నప్ప లో కనపడాలని కోరుకునేంతలా. ఇప్పుడు ఆ అదృష్టం కాజల్ ని వరించింది
అవును.. చందమామ కాజల్ అగర్వాల్ కి కన్నప్ప లో నటించే అవకాశం వచ్చింది. ఈ మేరకు ఆమెకి వెల్ కమ్ చెప్తు యూనిట్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుండంతో కాజల్ ఎలాంటి క్యారక్టర్ ని పోషిస్తుందనే దాని మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. త్వరలోనే ఆమె క్యారక్టర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. మగధీర లాంటి చారిత్రాత్మక మూవీలో నటించిన అనుభవం కూడా కాజల్ కి ఉంది
.webp)
2007 లో వచ్చిన లక్ష్మి కళ్యాణం తో కాజల్ తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు సుమారు యాభై సినిమాల దాకా చేసింది. 2020 లో గౌతమ్ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది.ఒక బాబు కి కూడా జన్మనిచ్చింది. ఇక గత కొంత కాలంగా పెద్దగా సినిమా ఆఫర్స్ ఏమి రాలేదు. ప్రస్తుతం సత్య భామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో చేస్తుంది. ఈ తరుణంలో కన్నప్ప మంచి అవకాశం అని చెప్పవచ్చు మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా అత్యున్నతమైన టీం పనిచేస్తోంది. న్యూజిలాండ్ లోని మంచు కొండల్లో కూడా షూటింగ్ ని జరుపుకుంది
![]() |
![]() |