![]() |
![]() |

శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం "డర్టీ ఫెలో".
ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సంస్థ కార్యాలయంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' మూవీ దర్శకుడు మల్లిడి వశిష్ఠ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో శాంతిచంద్ర, చిత్ర దర్శకులు మూర్తి సాయి అడారి మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

దర్శకులు మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ.. "శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది. మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మూవీ టిమ్ సభ్యులందరికీ అభినందనలు" అని అన్నారు.
చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ.. "మా డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి టిమ్ ని అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది" అని అన్నారు.
చిత్ర దర్శకులు మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ.. "డర్టీ ఫెలో ట్రైలర్ ను దర్శకులు వశిష్ఠ ఆవిష్కరించడం చాలా హ్యాపీగా ఉంది. మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయి" అని అన్నారు.
శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
సతీష్ కుమార్.పి సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రామకృష్ణ. యస్, ఎడిటర్ గా జేపీ వ్యవహరించారు.
![]() |
![]() |