![]() |
![]() |

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్.. ఇలా వరుసగా మూడు నెలల్లో నాలుగు సినిమాలతో సందడి చేశారు కొణిదెల కాంపౌండ్ స్టార్స్. అయితే, వాటిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడుదలైన సినిమాలు మంచి ఫలితాలను అందుకోగా.. ఏప్రిల్ లో రిలీజైన చిత్రాలు మాత్రం మెప్పించలేకపోయాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన `భీమ్లా నాయక్` విడుదల కాగా.. సదరు యాక్షన్ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ మూటగట్టుకోవడమే కాకుండా మంచి వసూళ్ళు ఆర్జించింది. ఇక మార్చి 25న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `ఆర్ ఆర్ ఆర్` జనం ముందుకు రాగా.. జాతీయ స్థాయిలో విడుదలైన ఈ పాన్ - ఇండియా మూవీ దాదాపు అన్ని చోట్ల భారీ వసూళ్ళు చూసింది. అలా.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొణిదెల స్టార్స్ పవన్, చరణ్ భారీ వసూళ్ళతో వార్తల్లో నిలిచారు.
అయితే, ఏప్రిల్ మాత్రం ఆ కాంపౌండ్ కి కలిసిరాలేదనే చెప్పాలి. ఏప్రిల్ 8న వచ్చిన కొణిదెల వరుణ్ తేజ్ స్టారర్ `గని` తీవ్ర నిరాశపరచగా.. ఈ రోజు (ఏప్రిల్ 29) విడుదలైన మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో మూవీ `ఆచార్య` కూడా అదే బాట పట్టింది. మొత్తమ్మీద.. ఏప్రిల్ 2022 కొణిదెల కాంపౌండ్ ని డిజప్పాయింట్ చేసింది.
![]() |
![]() |