![]() |
![]() |

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. 'పోకిరి' సినిమా రేంజ్ లో ఉంటుందని చెప్పి ఈ మూవీపై అంచనాలు పెంచేశాడు మహేష్. మే 12 న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
'సర్కారు వారి పాట'ని ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు. అయితే కరోనా మరియు మహేష్ మోకాలి సర్జరీ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తి అయిందని తెలుపుతూ మహేష్ ఫోటోని షేర్ చేశారు. మహేష్ ముఖానికి చెయ్యి అడ్డుపెట్టుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో ఆకట్టుకుంటోంది. మిలిగిన ఒక పాటను త్వరలోనే చిత్రీకరించనున్నారు.

'సర్కారు వారి పాట' నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, కళావతి సాంగ్, పెన్నీ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడంతో పాటు, సినిమా విడుదలకి ఇంకా నెల రోజులే ఉండటంతో.. చిత్ర యూనిట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి నుంచి మేకర్స్ రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
![]() |
![]() |